ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉద్యాన శాఖ రాయితీ
ఇందల్వాయి: కూరగాయలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉద్యానశాఖ పలు రా యితీలను అందిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు సంధ్యరాణి, రోహిత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకరానికి రూ.9,600తోపాటు పవర్ స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లు 50 శాతం రాయితీపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 89777 13980, 85558 34268 నంబర్ల ద్వారా ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
డిచ్‌పల్లి: తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు తేదీని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ నళిని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాల ల్లో ఐదో తరగతితోపాటు 6 నుంచి 9వ తర గతి వరకు ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కమ్మర్‌పల్లిలో
రాష్ట్రస్థాయి పోటీలు
కమ్మర్‌పల్లి: ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి 23వ తేదీ వరకు మండల కేంద్రంలో 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీ లు నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు. అండర్– 17 బా లుర, బాలికల విభాగంలో పోటీలు నిర్వ హిస్తున్నామని, రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 320 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె వెంట ఎంఈవో ఆంధ్రయ్య, హెచ్‌ఎం సాయన్న, పీడీ నాగభూషణం, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు.
సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి
సుభాష్‌నగర్: జిల్లాలోని దివ్యాంగులు సహా య ఉపకరణముల కోసం సంబంధిత అన్ని ధువ్రపత్రాలతో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ అధి కారి షేక్ రసూల్ బీ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. బ్యాటరీ ఆపరేటేడ్ వీల్‌చైర్లు, హైబ్రిడ్ వీల్‌చైర్ అటాచ్‌మెంట్, వీల్ చైర్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ, ట్రై సైకిల్, హై ఎండ్ ల్యాప్‌టాప్, ట్యాబ్స్ పొందేందుకు గతంలో దరఖాస్తులు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో నేరుగా లేదా 08462 251690 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.


