కార్యకర్త అధ్యక్షుడు కావడం బీజేపీలోనే సాధ్యం
● ప్యాకేజీల కోసమే ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ
● ఎన్‌ఎంసీలో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ
● కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావు
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్: దేశంలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీ లు రాజ్యమేలుతున్న తరుణంలో కేవలం పనితనం, చిత్తశుద్ధి ప్రామాణికంగా సామాన్య కార్యకర్త జాతీయ అధ్యక్షుడు కావడం బీజేపీలోనే సాధ్యమని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. జాతీ య అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడి పదవి చేపట్టడం బీజేపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని, కోట్లాది యువ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు.
డబ్బుల వసూళ్ల కోసమే..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్యాకేజీల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి సిట్ విచారణ చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్, ప్రశాంత్‌రెడ్డి కేంద్రం నుంచి వచ్చిన నిధులు మళ్లించారని మండిపడ్డారు.
ముస్లిం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి..
మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ ఏరియాలో ముస్లిం అభ్యర్థులు దర ఖాస్తు చేసుకుంటే బీజేపీ టికెట్ ఇస్తామని ఎంపీ అర్వింద్ పేర్కొ న్నారు. 75 ఏళ్లుగా కాంగ్రెస్‌కు, కొన్నేళ్లుగా బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేస్తున్నారని, జీవితాలు బాగుపడ్డాయా అని ముస్లిములను సూటిగా ప్రశ్నించారు. మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేసిన వెంటనే నిజామాబాద్‌ను ఇందూరుగా మార్చి తీరుతామన్నారు. ఇందూరుగా ఎందుకు మార్చకూడదో మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


