పదేళ్లలో 50 ఏళ్ల అభివృద్ధి
నిజామాబాద్ అర్బన్: అధికారంలో ఉన్న సుమారు పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం 50 ఏళ్ల అభివృద్ధి చేసిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల్లో అత్యధిక డివిజన్లు, వార్డుల్లో బీఆర్‌ఎస్ నాయకులు గెలుపొందుతారని అన్నారు. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కై వసం చేసుకుంటామన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. కళాభారతి, రైల్వేకమాన్ బ్రిడ్జి, ఖలీల్‌వాడిలోని మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నగర మాజీ మేయర్ దండు నీతూకిరణ్, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్‌సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, షెహజాద్, మతీన్ తదితరులు పాల్గొన్నారు.


