గృహజ్యోతితో విద్యుత్ బిల్లుల నుంచి ఊరట
సిరికొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి పథకం ద్వారా సామాన్యులకు విద్యుత్ బిల్లుల భారం నుంచి ఎంతో ఊరట లభిస్తోందని సర్పంచ్ పిట్ల వనితనర్సింగ్ అన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క జారీ చేసిన గృహజ్యోతి ఉచిత విద్యుత్ కరపత్రాలను సర్పంచ్ మంగళవారం ఆవిష్కరించారు. ప్రభుత్వం రాయితీ ఇస్తున్న విద్యుత్ బిల్లు డబ్బులను వినియోగదారులు తమ పిల్లల చదువులు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలన్నారు. ఉపసర్పంచ్ తలకట్ల రాంరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ్, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు గాదారి నర్సారెడ్డి, సురేందర్‌రెడ్డి, ఏఈ చంద్రశేఖర్, లైన్ ఇన్‌స్పెక్టర్ బాలచంద్రం, గ్రామస్తులు పాల్గొన్నారు.


