తుది దశకు ఉపాధి ‘ప్రణాళిక’
● కొత్త పనుల గుర్తింపునకు సర్వే
● చెరువుల్లో పూడికతీతకు బదులు
ఇతర పనులకు ప్రాధాన్యం
● గ్రామసభల నిర్వహణ
మోర్తాడ్(బాల్కొండ): ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే పనుల గుర్తింపు సర్వే తుది దశకు చేరుకుంది. జిల్లాలోని 540 గ్రామ పంచాయతీల పరిధిలో అక్టోబర్ 2 నుంచి కొత్త పనుల గుర్తింపు కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్‌లను సమన్వయం చేసుకుని సర్వే నిర్వహించారు. ఒక్కో గ్రామంలో కూలీల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని 10 నుంచి 25 వరకు పనులను గుర్తించారు. ప్రధానంగా ఇంకుడు గుంతల తవ్వకం, ప్లానిటేషన్, గొర్రెలు, గేదెల కోసం షెడ్ల నిర్మాణం, గుట్టల వద్ద కందకాల తవ్వకం, ఇతరత్రా పనుల గుర్తింపు కోసం ఉపాధి హామీ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల గు ర్తింపు పూర్తిచేసిన గ్రామాలలో గ్రామసభలను నిర్వహించి కొత్త పనుల కోసం ఆమోదం తీసుకున్నారు. గుర్తించిన పనులకు ఆమోదం లభించిన తర్వాత బడ్జెట్ కోసం అంచనాలను తయారు చేసి ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. కొ త్త పనుల గుర్తింపులో భాగంగా వ్యక్తిగతమైన ప నులకు కూడా ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు. బీడు భూములను అభివృద్ధి చేయడం, భూగర్భ జలాల వృద్ధి కోసం ఇంకు డు గుంతలు, కందకాలను తవ్వించం, మొక్కలను పెంచడం ప్రధానంగా చేపట్టనున్నారు. అయితే, చె రువులలో పూడికతీత పనులకు దాదాపు స్వస్తి పలికినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పనుల్లో పారదర్శకత లోపించకుండా పక్కా ప్రణాళికతోనే అంచనాలను తయారు చేస్తున్నాం. జిల్లాలో 1.57 లక్షల జాబ్‌కార్డులకు 2.35 లక్షల మంది కూ లీలు ఉన్నారు. రెగ్యులర్‌గా పనులకు వచ్చే 90 వేల మంది కూలీలను పరిగణనలోకి తీసుకొని పనుల గుర్తింపు జరిగింది. ఉపాధి కూలీలకు ప్రయోజనం కల్పిస్తూ అందరికీ లబ్ధి చేకూరే పనులకే ప్రాధాన్యం ఇచ్చాం. – సాయాగౌడ్, డీఆర్డీవో


