మురికి కాలువను శుభ్రం చేసిన కమిషనర్
బోధన్‌టౌన్ : బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ శుక్రవారం స్వయంగా మురికి కాలువను శుభ్రం చేశారు. పట్టణంలోని హెడ్ పోస్టాఫీసు ఎదుట ఉన్న మురికి కాలువలో చెత్త పేరుకుపోయి మురికి నీరు నిలిచిపోయింది. పోస్టాఫీసుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తెలుత్తుతున్నాయని ఫిర్యాదులు రావడంతో స్పందించిన కమిషనర్ కార్మికులతో కలిసి వెళ్లారు. జేసీబీతో మురికి కాలువను శుభ్రం చేయించాలని కార్మికులు అన్నారు. జేసీబీతో మురికి కాలువ ధ్వంసం అవుతుందని కార్మికులకు చెబుతూ స్వయంగా గడ్డపార చేతబట్టి మురికి నీరుకు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించారు. పట్టణంలోని కాలనీల్లోగల మురికి కాలువల్లో చెత్త చెదారం పేరుకు పోకుండా చూడాలని పారిశుద్ధ్య అధికారులకు, కార్మికులకు సూచించారు. ప్రజలు మురికి కాలువల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు.


