కోర్టు ధిక్కారమా?
న్యూస్‌రీల్
నిజామాబాద్
లీగల్ ఒపీనియన్ పేరిట..
హైకోర్టు తీర్పును లెక్కచేయని వైనం
● తెయూ అధికారుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు
● అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉన్నతాధికారుల ప్రయత్నాలు
● ప్రమోషన్ల ఫైలును కదిలించేందుకు పలుమార్లు యత్నం
● గతంలో అనేకసార్లు తిరస్కరిస్తూ చేసిన పాలకమండలి తీర్మానాల బేఖాతరు
● ఫైల్ కదిపేందుకు పెరుగుతూ పోయిన డీల్ ధర
వాతావరణం
ఉదయం ప్రకాశవంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది. మంచు కురుస్తుంది.
ఇంగ్లిష్‌పై పట్టు..
విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించడానికి ‘సాక్షి స్పెల్‌బీ’ ఎంతగానో ఉపయోగపడు తుందని ఉపాధ్యాయులు అన్నారు.
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
– 8లో u
రెండ్రోజులు రైల్వేగేటు మూసివేత
డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండలం నడిపల్లి–ఘన్‌పూర్ గ్రామాల మధ్య ఉన్న రైల్వే గేటును రెండురోజులపాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిచ్‌పల్లి–ఇందల్వాయి రైల్వేస్టేషన్ల మధ్య అనుసంధానించే కి.మీ. 473/7–8 వద్ద ఉన్న లె వల్ క్రాసింగ్ గేట్ నెం.196టీ ఎల్‌సీ గేట్ మ రమ్మతు పనుల కోసం ఈ నెల 8న రాత్రి ఒంటి గంట నుంచి 9వ తేదీ రాత్రి 11 గంట ల వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారి, పోలీస్ క్యాంప్ మీదుగా ఘన్‌పూర్ గ్రామానికి దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
పలువురు జడ్జీల బదిలీ
నిజామాబాద్ లీగల్: జిల్లాకు చెందిన పలువురు జడ్జీలు, అదనపు జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఉన్న ఆశాలత ఎల్‌బీ నగర్ ఫ్యామిలీ కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. మహిళా కోర్టు జడ్జిగా ఉన్న హరీష నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జిగా బదిలీ కాగా, ఆమె స్థానంలో నల్గొండ నుంచి డి.దుర్గాప్రసాద్ రానున్నారు. బోధన్‌లో ఖాళీగా ఉన్న అదనపు జిల్లా జడ్జిగా మెదక్ నుంచి డి. వరూధిని వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శిగా ఉన్న డి. ఉదయభాస్కర్ రావు పదోన్నతిపై హైదరాబాద్ పోక్సో కోర్టుకు వెళ్లనున్నారు. నూతన కార్యదర్శి వచ్చే వరకు నిజామాబాద్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. బదిలీ అయిన జడ్జీలు ఈ నెల 14 లోపు తమకు కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది.
నేటి నుంచి
కాలేజీలు రీఓపెన్
ఖలీల్‌వాడి: జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు శనివారం తెరచుకోనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో కళాశాల తరగతులు యథావిధిగా కొనసాగుతాయని టీయూ ప్రైవేటు డిగ్రీ కాలేజీల అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.
ఎంపీవోలకు
మండలాల కేటాయింపు
సుభాష్‌నగర్: జిల్లాకు అలాట్ అయిన నలుగురు ఎంపీవోలకు శుక్రవారం మండలాలను కేటాయించారు. బోధన్‌కు వేణు, రుద్రూర్‌కు అరవింద్‌కుమార్, మాక్లూర్‌కు బాలామణి, నందిపేటకు అజయ్‌లను కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 2012లో రోస్టర్ పాటించకుండా ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ వర్సిటీలో చేసిన అధ్యాపక నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కాగా అడుగడుగునా కోర్టు ధిక్కార ధోరణితో వెళుతుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోర్టులో పిటిషన్ దాఖలయ్యాక నియామకపత్రాలు తీసుకున్న అధ్యాపకులు ఆ సమయంలో కోర్టు తీర్పునకు లోబడతామని రాసిచ్చారు. అయినప్పటికీ తాజా తీర్పు నేపథ్యంలో యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మరోవైపు ఈ అధ్యాపకుల ప్రమోషన్లకు సంబంధించి కోర్టు కేసును పట్టించుకోకుండా కథ నడిపించడం గమనార్హం. ఈ వ్యవహారంలో సుమారు రూ.5 కోట్లు చేతులు మారినట్లు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ డీల్‌కు సంబంధించి ధర ఎప్పటికప్పుడు పెరుగుతూ పోయినట్లు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్రస్థాయిలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఒక్కరికే గతంలో రూ.1.5 కోట్లు ముట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు రిజిస్ట్రార్ మధ్యవర్తిగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అయితే గతంలో పాలకమండలి అడ్డుపడడంతో ఈ ప్రమోషన్ల వ్యవహారానికి బ్రేక్ పడుతూ వచ్చింది. కాగా పాలకమండలి పదవీకాలం పూర్తికావడంతో గతేడాది కాలంగా ప్రమోషన్ల ఫైలును మరింత స్పీడ్‌గా కదిపేందుకు రిజిస్ట్రార్ గట్టి ప్రయత్నాలు చేస్తూ రావడం విశేషం. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కేసుతో ఈ కేసును పోల్చి పదోన్నతులు కల్పించే కుట్ర చేయడం గమనార్హం. పాలకమండలి లేకపోవడంతో గతంలో ఉన్నత విద్యాశాఖలో కీలకంగా ఉన్న ఓ ఉన్నతాధికారి ప్రత్యేకంగా ఈ ఫైలుపై సంతకం చేసి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేసు తీవ్రత కప్పిపెట్టి ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని లీగల్ ఒపీనియన్ పేరిట ఒక లేఖ సృష్టించడం విశేషం. విద్యాశాఖ న్యాయ నిపుణుల నుంచి కాకుండా వేరే విభాగానికి చెందిన న్యాయ నిపుణుల ఒపీనియన్ తీసుకున్నారు. ఇందుకు రూ.2 లక్షల ప్రభుత్వ (యూనివర్సిటీ) సొమ్ము ఖర్చు పెట్టినట్లు సమాచారం.
అనేక ఆరోపణల నేపఽథ్యంలో 2012 ఏడాది చివరిలో అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, 2013 ఫిబ్రవరిలో నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందుబాటులో ఉన్నవాళ్లను జాయిన్ చేసుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సదరు నియామకాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నియామకాల్లో అక్రమాలపై విద్యార్థి సంఘాలు సాక్ష్యాలను బయటపెట్టాయి. పత్రికల్లో వార్తలు రావడం, ఎంపిక కాని అర్హులు కొందరు ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం, ఇక్కడే పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్లు ఆందోళనలకు దిగడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. ఈ నియామకాలపై సమగ్ర విచారణ జరిపేందుకు 2013 ఫిబ్రవరి 22న ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్‌లోగా నివేదిక సమర్పించాలని కోరింది. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 25న ఈ నియామకాలకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వెలువరించవద్దని అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే సమయంలో అటు అకడమిక్ కన్సల్టెంట్లు సైతం ఈ నియామకాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ రోజురోజుకూ వివాదాస్పదంగా తయారైంది. ఈ విషయమై జస్టిస్ సీవీ రాములు ఇచ్చిన నివేదికపై అప్పటి గవర్నమెంట్ ప్లీడర్ (ఉన్నత విద్యాశాఖ) సి వాణీరెడ్డి ద్వారా లీగల్ ఒపీనియన్ కోరుతూ 41వ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ నియామకాలపై జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. 2018 సెప్టెంబర్ 26న జరిగిన పాలకమండలి సమావేశంలో జస్టిస్ సీవీ రాములు ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన పాలకమండలి, ఆయా నియామకాల్లో అక్రమాలు జరిగాయని గుర్తించింది. దీన్ని తీవ్రంగా పరిగణించి, సదరు నియామకాలు చేపట్టిన అప్పటి వీసీ ఆచార్య అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ ఆచార్య అశోక్‌లపై ఉస్మానియా యూనివర్సిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ వర్సిటీకి లేఖ రాయాలని తెలంగాణ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లను పాలకమండలి సభ్యులు ఆదేశించారు. పైగా అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ పెన్షన్ బెనిఫిట్స్‌ను పూర్తిగా నిలిపేయాలని, అశోక్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని నిర్ణయించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను ఉస్మానియా వర్సిటీ నుంచి తెప్పించుకోవాలని ఆదేశించారు. జస్టిస్ సీవీ రాములు నివేదిక ప్రకారం అక్బర్ అలీఖాన్, అశోక్‌లపై సత్వరమే క్రిమినల్ కేసు పెట్టాలని తెలంగాణ వర్సిటీ వీసీ ఆచార్య సాంబయ్య, రిజిస్ట్రార్ బలరాములును పాలకమండలి ఆదేశించింది.
ప్రభుత్వ ప్లీడర్ వాణీరెడ్డి ఒపీనియన్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ నియామకాలను ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని కోరుతూ 2014 నియామక అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలని అప్పటి వీసీ, రిజిస్ట్రార్‌లను పాలకమండలి ఆదేశించింది. ఇలా ప్రతి పాలకమండలి సమావేశంలో తిరస్కరణకు గురైన వివాదాస్పద నియామకాలకు విద్యాశాఖ కార్యదర్శితో ప్రస్తుత రిజిస్ట్రార్ యాదగిరి ఏవిధంగా లీగల్ ఒపీనియన్ తీసుకునేలా ఒప్పించారనేది ప్రశ్నార్థకంగా మారింది. మొదటి లీగల్ ఒపీనియన్ తీసుకునేముందే పాలకమండలి అనుమతి కోరారు. మరి ఇప్పుడు పాలకమండలిని ఎందుకు మరిచారో, పూర్తిస్థాయిలో పాలకమండలి లేని సమయంలో ఆగమేఘాల మీద గుట్టు చప్పుడు కాకుండా లీగల్ ఒపీనియన్‌కు ఎందుకు పంపారనేది తెలియాలని పలువురు అంటున్నారు. 2019 మార్చి 30న జరిగిన 44వ పాలకమండలి సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తర్వాత తమకు పదోన్నతి కల్పించాలని కోరుతూ వివాదాస్పద 2014 అభ్యర్థులు పెట్టుకున్న వినతిని 48వ పాలకమండలి సమావేశం తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 2014 నియామకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నుంచి 2022 జూలై 13న లేఖ వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.
మాట్లాడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్, పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి,
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్, మాజీ కార్పొరేటర్లు
సుభాష్‌నగర్: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. రైతు లు ఇబ్బందులు పడకుండా ఏనాడూ ధాన్యాన్ని కొ నుగోలు చేయలేదని, ప్రతియేటా అన్నదాతలను ఇ బ్బందులు పెడుతూనే కొంటున్నారని ఆరోపించా రు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం సేకరణ ప్రక్రియ మొత్తం కేంద్రమే చేపడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయన్నారు. ధాన్యం సేకరించినందుకు రా ష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తుందని గుర్తుచేశారు. ఎ క్కడ చూసినా రోడ్లపైనే ధాన్యం కన్పిస్తోందని, సేక రణలో తీవ్ర జాప్యం జరగడంతోనే అకాలవర్షాలకు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైస్‌మిల్లర్లను ఒత్తి డి చేస్తున్నారని, వారు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రమంతా ఒకే పంట పండిస్తే ఎలా అని, ప్రణాళికా ప్రకారం పంటలను మార్పిడి చేయాలన్నారు. వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారు..
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన కల్వకుంట్ల కుటుంబం ఏం మొహం పెట్టుకొని జూబ్లీహి ల్స్ ఉపఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేశారే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. బీ సీ, ఎస్సీ, ఎస్టీల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపేసి న, ఉద్యోగ, ఉపాధి కొల్లగొట్టిన వారే బీసీలపై అధి క ప్రేమ చూపిస్తున్నారని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆరోపించారు. బీసీలను కేవలం రాజకీ యంగా, ఓట్ల కోసమే వాడుకుంటున్నారన్నారు. కే సీఆర్, కేటీఆర్‌పై కాళేశ్వరం, ఈ–కార్, ఫోన్ ట్యా పింగ్, గత ప్రభుత్వ అన్ని స్కీముల్లో స్కాములను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వారిపై కే సులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. వా రిని జైల్లో వేయకుండా వెనకేసుకొస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అతిపెద్ద తప్పు చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గులాంగిరి చేస్తున్నాడని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో బినామీ పేర్ల తో రైస్‌మిల్లులను పెట్టి ధాన్యం అమ్ముకొని పారిపో యారని షకీల్‌ను ఉద్దేశించి విమర్శించారు. జిల్లాలో ని ఆర్‌వోబీల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిస్తే 10 రోజుల్లో విడుదల చేస్తామని హామీనిచ్చారని ఎంపీ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో తన సోషల్ మీడియా ద్వారా అక్కడి ప్రజలను ప్రభావితం చేస్తున్నామని, హిందువులు, ముస్లిములు అన్ని విషయాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
జ్యోతీబాపూలే పాఠశాల తనిఖీ
రాంపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతీబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. వండడానికి ముందే ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సతీశ్, ప్రిన్సిపాల్ నరేందర్, స్థానిక అధికారులు ఉన్నారు.
వ్యవసాయ విధానాన్ని
రూపొందించాలి
కేసీఆర్‌కు గులాంగిరి చేస్తున్న
సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రాన్ని అన్ని విధాలా
సర్వనాశనం చేసిన బీఆర్‌ఎస్
ఎంపీ అర్వింద్ ధర్మపురి
కోర్టు ధిక్కారమా?
కోర్టు ధిక్కారమా?
కోర్టు ధిక్కారమా?


