గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 9 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 573 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు.
36.95 మెగావాట్ల విద్యుదుత్పత్తి..
ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతుండడంతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో రికార్డు స్థాయిలో 36.95 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 71 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్‌కో అధికారులు తెలిపారు.
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి రాంనగర్‌కు చెందిన అడ్లరేవతి, భూమయ్య కుటుంబసభ్యులు రూ. 8,88,888లు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు వారిని సన్మా నించారు. కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ మచ్చేందర్, ముదిరాజ్ సంఘం పెద్దబజార్ అధ్యక్షుడు బొండ్ల సంతోష్, సభ్యు లు జక్కం పోశెట్టి, మోహన్, బాలనంద్, భోజ న్న, మందుల బాలు, మహేందర్, పోశెట్టి, లింగం తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్: మండలంలోని మాదాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాన్ని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి ఎం రోహిత్‌రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంతవరకు ఎన్ని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారని మండల పశువైద్యాధికారులు ఉమా సహేర్, కిరణ్‌దేశ్‌పాండేని అడిగి తెలుసుకున్నారు. మిగిలిన గ్రామాల్లో త్వరితగతిని వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట పశువైద్య సిబ్బంది టి వినీత, ఆర్ కల్యాణి, అహ్మద్‌పాషా, శ్యామల, గంగాధర్, రవి, సుఽధీర్ పశువుల పెంపకందారులు ఉన్నారు.
బోధన్: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో స్వీ కరించిన, సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, తిరస్కరించిన దరఖాస్తుల వివరాల ఫైల్స్‌ను తన ఆఫీస్‌లో సమ ర్పించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ తో సాలూర తహసీల్దార్ శశిభూషణ్‌ను ఆదేశించారు. గురువారం సాలూర తహసీల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. రెవెన్యూ సద స్సు దరఖాస్తులు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం పురోగతి పై సమీక్షించారు.
గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల
గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల


