మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య

జిల్లా స్థాయి కమిటీ సమావేశం

నిజామాబాద్‌ అర్బన్‌: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి ని ఘా కొనసాగించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంబించా ల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్‌, సీపీ దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీ స్‌, ఎకై ్సజ్‌, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు. గర్భిణులు కల్తీ కల్లు బారిన పడకుండా అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా, విక్రయిస్తున్న వారిని, వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ నిఘా కొనసాగిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదనపు కలెక్టర్‌ దిలీప్‌ కుమార్‌, ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి, డీఈవో అశో క్‌, డీటీసీ దుర్గాప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement