రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలి

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

నిజామాబాద్‌ అర్బన్‌: రోడ్డు ప్రమాదాల నియంత్ర ణ కోసం కృషి చేయాలని, ఇందుకోసం విస్తృత స్థా యిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్‌ అ ధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్ర తి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను విధిగా పాటి స్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ దిశగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పా టు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చైతన్యపర్చేందుకు కృషి చేయాలన్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 55 బ్లాక్‌ స్పాట్‌ ప్రాంతాల గురించి, ప్రమాదాలకు గల కారణాలపై సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుక లోడ్‌తో కూడిన వాహనాలు తిరగకుండా నిఘా ఉంచాలన్నారు. స్కూల్‌ బస్సుల తని ఖీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి వాహనం తగిన ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలన్నారు. వరి కోతల సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని, దీని ని దృష్టిలో పెట్టుకొని ఓవర్‌ లోడ్‌తో వెళ్లే వాహనా లను నియంత్రించేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా, అందుకు గల కారణాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని, త ద్వారా అలాంటి చోట్ల మరోమారు ప్రమాదాలు జ రుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. అధికారులు అంకితభావంతో కృషి చేస్తూ నిజామాబాద్‌ను రోడ్డు ప్రమాద ర హిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, అదనపు కలెక్టర్‌ దిలీప్‌ కుమార్‌, ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి, డీఈవో అశోక్‌, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ దుర్గా ప్రమీల, డీటీవో ఉమా మహేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, హర్ష, నేషనల్‌ హైవే అథారిటీ, ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్‌, విద్యుత్‌, వైద్యారోగ్యం, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులతోపాటు రోడ్‌ సేఫ్టీ కమిటీ సభ్యులు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

అవగాహన కార్యక్రమాలు

విస్తృతంగా నిర్వహించాలి

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా

కమిటీ సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement