క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Nov 7 2025 7:41 AM | Updated on Nov 7 2025 7:41 AM

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు ఇద్దరికి ఏడాది జైలు

బాలుడి ఆత్మహత్య

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని హనుమాన్‌ నగర్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమాన్‌ నగర్‌లోని చైతన్య(13) అనే బాలుడు గతేడాది ఓ ప్రయివేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువగా, ప్రస్తుతం బడికి వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. గురువారం అతడి తల్లిదండ్రులు ఊరికి వెళ్లగా రాత్రివేళ ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేవు. చిన్న వయస్సులోనే బాలుడు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా అందరిని కలచి వేసింది. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.

నవీపేట: మండలంలోని అబ్బాపూర్‌ (ఎం) సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. అబ్బాపూర్‌(ఎం) గ్రామానికి చెందిన రవి గౌడ్‌ బావమరిది సురేశ్‌గౌడ్‌ కుమారులు వియాన్‌, అయాన్‌లను తీసుకుని బైక్‌పై నవీపేట వైపు వచ్చారు. తిరిగి అబ్బాపూర్‌(ఎం)కు వెళ్తుండగా నిజామాబాద్‌ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో రవి గౌడ్‌, వియాన్‌, అయాన్‌లకు గాయాలయ్యాయి. రవిగౌడ్‌ తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బాల్కొండ: మండలంలోని బోదేపల్లి శివారులో వ్య వసాయ విద్యుత్‌ మోటర్ల నుంచి వైర్‌ దొంగిలించిన కేసులో చిట్టాపూర్‌కు చెందిన పుట్ట నాగేశ్‌, ఆలూర్‌ మండల కేంద్రానికి చెంచు పుట్ట నరేశ్‌లకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఆర్మూర్‌ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సరళరాణి గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్సై శైలేందర్‌ తెలిపారు. కేసులో నిందితులపై చార్జీషీట్‌ దాఖలు చేయగా, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారని తెలిపారు. ఏ3గా ఉన్న అనీష్‌ బేగంకు రూ.1500 జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

న్యూసెన్స్‌ చేసిన

ముగ్గురు మహిళలకు..

నిజామాబాద్‌అర్బన్‌: మగవారిని ఆకర్షిస్తూ న్యూసె న్స్‌ చేస్తున్న ముగ్గురు మహిళలకు కోర్టు రెండు రో జుల జైలు శిక్ష విధించిందని ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌ వో రఘుపతి తెలిపారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలోని బస్టాండ్‌లో కళావతి, కరోల్ల లత, దుర్గ మగవారిని ఆకర్షించి ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి స్పెషల్‌ సెకండ్‌ క్లాస్‌ జడ్జి ఎదుట హాజరుపరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement