అనవసరపు కాల్స్‌ వేధిస్తున్నాయా..? | - | Sakshi
Sakshi News home page

అనవసరపు కాల్స్‌ వేధిస్తున్నాయా..?

Oct 13 2025 9:02 AM | Updated on Oct 13 2025 9:02 AM

అనవసరపు కాల్స్‌ వేధిస్తున్నాయా..?

అనవసరపు కాల్స్‌ వేధిస్తున్నాయా..?

మీకోసం..

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మీరు అత్యవసర పనుల్లో, ఇతరులతో సమావేశాల్లో ఉన్నప్పుడు ప్రమోషనల్‌, మార్కెటింగ్‌ కాల్స్‌ వస్తుంటాయి. ఈ అనవసరపు ఫోన్‌కాల్స్‌ రోజు ఇబ్బంది పెడుతున్నాయా... అయితే ఫోన్‌లో పలు మార్పులతో కట్టడి చేయొచ్చు. యాక్టివేట్‌ డీఎన్డీ ప్రమోషనల్‌, మార్కెటింగ్‌ ఫోన్‌ కాల్స్‌ రాకుండా ఉండాలంటే మొదట ఫోన్‌లో డీఎన్డీ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేయాలి.

● STARTO అని టైప్‌ చేసి.. 1909కి ఎస్‌ఎంఎస్‌ చేస్తే ప్రమోషనల్‌ కాల్స్‌ ఆగిపోతాయి. వెబ్‌సైట్‌ https:/// www. dndcheck. co. in లోకి వెళ్లి ‘నేషనల్‌ డునాట్‌ కాల్‌ రిజిస్ట్రీ’లో ప్రమోషనల్‌ కాల్స్‌కు అడ్డుకట్ట వేయొచ్చు. టెలికాం ప్రొవైడర్లందరికీ.. అధికారిక యాప్‌ ఉంటుంది.(ఉదాహరణకు మై జియో, ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌, వీఐ యాప్‌). అందులో డీఎన్డీ సెట్టింగ్‌లోకి వెళ్లి ప్రిఫరెన్స్‌ ఎంపిక చేసుకొని ప్రమోషనల్‌ కాల్స్‌ బ్లాక్‌ చేయొచ్చు.

● బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో లాగిన్‌ అయ్యి.. కమ్యూనికేషన్‌ ప్రిఫరెన్సెస్‌ లేదా ప్రొఫైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్కెటింగ్‌, ప్రమోషనల్‌ ఈ మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌, కాల్స్‌ ఆప్షన్‌ డిజేబుల్‌ చేయడం ద్వారా అనవసరపు ఫోన్‌కాల్స్‌ను తగ్గించుకోవచ్చు.

మాన్యువల్‌ నంబర్‌ బ్లాకింగ్‌..

డీఎన్డీ సెట్టింగ్‌ను యాక్టివేట్‌ చేసినా అనవసరమైన ఫోన్లు వస్తే ఫోన్‌లోని కాల్‌ బ్లాకింగ్‌ ఫీచర్‌ను ఉపయోగించి అడ్డుకట్ట వేయొచ్చు. ట్రూ కాలర్‌, కాల్‌ బ్లాకర్‌ లాంటి యాప్‌లు కూడా ఉన్నాయి. అవి స్పామ్‌, బ్యాంక్‌, మార్కెటింగ్‌ ఫోన్‌కాల్స్‌ను గుర్తిస్తాయి. ఒకసారి కాల్‌ వచ్చినప్పుడు ‘మార్క్‌ కాల్స్‌ యాజ్‌ స్పామ్‌’ ఆప్షన్‌ ఎంచుకుంటే ..ఆ తర్వాతి నుంచి ఆయా నంబర్ల నుంచి కాల్స్‌ రావు.

నేరుగా బ్యాంకుకే..

ఒకే బ్యాంక్‌కు చెందిన మార్కెటింగ్‌ సిబ్బంది నుంచి తరచూ కాల్స్‌ వస్తుంటే.. ఆ బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ సర్వీసుకు కాల్‌ చేసి.. లేదంటే నేరుగా బ్రాంచ్‌కి వెళ్లి ‘అప్డేట్‌ యువర్‌ ప్రిఫరెన్సెస్‌’ను మార్చాలని కోరాలి. గతంలో మీరు ‘మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌’కు అంగీకారం తెలిపినట్లయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కచ్చితంగా చెప్పాలి.

డీఎన్డీ ఆప్షన్‌ యాక్టివేట్‌ చేసినా..

కాల్స్‌ వస్తుంటే.. నేరుగా 1909కి ఫోన్‌ చేసి.. ఫిర్యాదు చేయొచ్చు. https:/// www. nccptrai. gov. in ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement