బీసీకా.. ఓసీకా..? | - | Sakshi
Sakshi News home page

బీసీకా.. ఓసీకా..?

Oct 13 2025 8:32 AM | Updated on Oct 13 2025 8:32 AM

బీసీక

బీసీకా.. ఓసీకా..?

పోటాపోటీగా దరఖాస్తులు

డీసీసీ పీఠం కోసం తీవ్ర పోటీ

భారీగా అందిన దరఖాస్తులు

మానాల తరువాత ఎవరో..

కాంగ్రెస్‌ పదవులపై సర్వత్రా ఆసక్తి

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై సర్వత్రా చర్చసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై అందరి దృష్టి ఉన్న ప్రస్తుత తరుణంలో.. పార్టీ పదవుల్లో సైతం బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీసీసీ పీఠంపై కూర్చునేది బీసీనా..? ఓసీనా..? తేలాల్సి ఉంది. డీసీసీ కోసం 18 మంది దరఖాస్తులు అందజేయగా.. సీసీసీ(సిటీ కాంగ్రెస్‌ కమిటీ) పదవి కోసం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తరువాత ఆ పీఠం ఎవరికి దక్కతుందనే అంశంపై చర్చ సాగుతోంది. జి ల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఆశావహు లు ఎవరికి వారు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతోపాటు పీసీసీ అ ధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సొంత జిల్లా కావడంతో డీసీసీ పీఠంపై మరింత ఆసక్తి నెలకొంది. పార్టీ నాయకత్వం ఎంపిక ఎలా ఉంటుందో.. పీసీసీ అ ధ్యక్షుడి ఆలోచన ఏవిధంగా ఉంటుందనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు బీసీ రిజర్వేషన్ల వ్యవహారం నేపథ్యంలో స్థానిక సంస్థల ఎ న్నికలు మరింత దూరం వెళ్లాయి. మరోవైపు పార్టీ పదవుల్లో సైతం బీసీలకు 42 శాతం అవకాశాలు క ల్పించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పీఠం బీసీ నాయకుడికి కేటాయిస్తా రా.. ఓసీ నాయకుడికి అప్పగిస్తారా..? అని కార్యకర్తలు, నాయకులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిజామాబాద్‌ నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవి కోసం సైతం ఆశావహులు దరఖాస్తు చేసుకున్నా రు. ఏఐసీసీ నుంచి వచ్చిన పరిశీలకులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి వివిధ వర్గాల, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి, దరఖాస్తు లు చేసుకున్న నాయకులతో ముఖాముఖి మాట్లాడి పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక మేరకు డీసీసీ, సీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసేందుకు పార్టీ రంగం సిద్ధం చేసింది.

నగర అధ్యక్ష పీఠం కోసం తొమ్మిది మంది..

నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న కేశ వేణు ‘నుడా’ చైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు. అయితే కేశ వే ణు డీసీసీ, సీసీసీ పీఠాల్లో దేనికీ దరఖాస్తు చేయలే దు. వేణు తరువాత నగర కాంగ్రెస్‌ పీఠం ఎవరికనే విషయమై చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం సై తం పోటీ గట్టిగానే ఉంది. కీలకమైన నగర అధ్యక్ష పదవి కోసం సయ్యద్‌ ఖైసర్‌ మైనారిటీ కోటా నుంచి రేసులో ముందున్నారు. మరోవైపు డీసీసీకి దర ఖాస్తు చేసుకున్న నరాల రత్నాకర్‌, మహ్మద్‌ జావెద్‌ అక్రమ్‌ సైతం సీసీసీ రేసులోకి వచ్చారు. మరోవైపు పంచరెడ్డి చరణ్‌, బొబ్బిలి రామకృష్ణ, కాప్‌కార్‌ గన్‌రాజ్‌, శరత్‌కుమార్‌, మహ్మద్‌ కరీముద్దీన్‌, అంతిరెడ్డి విజయ్‌పాల్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

డీసీసీ పీఠం కోసం అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 18 మంది తమ దర ఖాస్తులను అందించారు. రేసులో యూత్‌ కాంగ్రెస్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా పనిచేస్తూ వచ్చిన మార చంద్రమోహన్‌రెడ్డి(ఆర్మూర్‌), ని జామాబాద్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, పీసీ సీ మాజీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేశ్‌రెడ్డి (రూరల్‌), డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మునిపల్లి సాయిరెడ్డి(రూరల్‌), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌కు సన్నిహితుడైన పీసీసీ డెలిగేట్‌ బాడ్సి శేఖ ర్‌ గౌడ్‌ (రూరల్‌), పీసీసీ అధికార ప్రతినిధిగా చే సిన సీఎం రేవంత్‌ సన్నిహితుడు బాస వేణుగోపాల్‌యాదవ్‌(బాల్కొండ) రేసులో ముందున్నా రు.

అదేవిధంగా మహ్మద్‌ జావెద్‌ అక్రమ్‌(అర్బ న్‌), నరాల రత్నాకర్‌(అర్బన్‌), గంగాశంకర్‌(బోధన్‌), కునిపురి రాజారెడ్డి(బాన్సువాడ), కోల వెంకటేశ్‌(ఆర్మూర్‌), అయ్యప్ప శ్రీనివాస్‌(ఆర్మూ ర్‌), జి.నటరాజ్‌(అర్బన్‌), కె.సాయికుమార్‌(అర్బన్‌), ముషు పటేల్‌(అర్బన్‌), మహ్మద్‌ ఖరీముద్దీన్‌(అర్బన్‌), ఇమ్మడి గోపి(రూరల్‌), జగడం సుమన్‌(అర్బన్‌), ఎంఏ అలీమ్‌(అర్బన్‌) దరఖా స్తు చేసుకున్నారు. అయితే రాష్ట్ర కార్పొరేషన్‌ చై ర్మన్‌ పదవి రేసులో ముందంజలో ఉన్న బాడ్సి శేఖర్‌గౌడ్‌కు ఆ పదవి దక్కుతుందా.. డీసీసీ పీ ఠం వస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

బీసీకా.. ఓసీకా..?1
1/2

బీసీకా.. ఓసీకా..?

బీసీకా.. ఓసీకా..?2
2/2

బీసీకా.. ఓసీకా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement