పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి

Oct 13 2025 8:32 AM | Updated on Oct 13 2025 8:32 AM

పటాకు

పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి

నియామకం

నిజామాబాద్‌ అర్బన్‌: దీపావళి పండుగ సందర్భంగా పటాకుల దుకాణదారులు తప్పనిసరిగా డివిజన్‌ స్థాయి పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని సీపీ సాయిచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. పటాకులు విక్రయించేందుకు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసే వారు సంబంధిత డివిజన్‌ పోలీసు అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు. పటాకుల దుకాణాలను ఖాళీ ప్రదేశాల్లో నెలకొల్పాలని, అనుమతి లేని దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక క్లస్టర్‌లో 50 షాపులకు మించొద్దని, అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించాలని సూచించారు.

15 నుంచి పశువులకు

గాలికుంటు టీకాలు

జిల్లాకు చేరిన 2 లక్షల డోసులు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశా ల మేరకు జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి తెల్ల, నల్ల జాతి పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్న ట్లు జిల్లా పశువైద్యాధికారి రోహిత్‌రెడ్డి తెలిపారు. జిల్లాకు 2 లక్షల డోసులను ప్రభు త్వం సరఫరా చేయగా వచ్చే నెల 14 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లా లో 2లక్షలకు పైగా పశువులు ఉన్నాయని, ప్రతి ఆరు నెలలకోసారి ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాల్సి ఉంటుందన్నారు. పా డి రైతులందరూ ఈ నెల 15నుంచి సమీప పశువైద్య కేంద్రంలో లేదా పశువైద్యులను గ్రామాల్లోకి రప్పించుకుని పశువులకు గాలి కుంటు టీకాలను వేయించాలని కోరారు.

థాయ్‌ బాక్సింగ్‌లో పతకాలు

నిజామాబాద్‌ నాగారం: రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–17 థాయ్‌ బాక్సింగ్‌ పోటీల్లో జిల్లాకు పతకాలు వచ్చాయి. ఆ దివారం హన్మకొండ జిల్లాలో జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు నిహారిక, శ్రీవల్లి బంగారు పతకం, కుల్‌సం, శ్వేత రజత పతకం, శృతి కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా వారిని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాగమణి అభినందించారు.

‘సాగర్‌’లోకి 13,662 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 13,662 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 13,562 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 1405 (17.8 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.

కామారెడ్డి టౌన్‌: ఆ ల్‌ ఇండియా ఫోర మ్‌ ఫర్‌ రైట్‌ టు ఎడ్యుకేషన్‌ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచ ర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్‌ కుమార్‌ నియమితులయ్యారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఇటీవల జరిగిన 8వ జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అందులో ఆయనకు చోటు దక్కింది. ఈ మేరకు టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ తదితరులు అనిల్‌ను అభినందించారు.

పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి
1
1/3

పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి

పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి
2
2/3

పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి

పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి
3
3/3

పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement