
నెల్లూరు అతిథులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన బాతులు రెంజల్ మండలం సాటాపూర్ ప్రాంతంలోని వ్యవసాయ భూముల్లో సందడి చేస్తున్నాయి. నెల్లూరు నుంచి వచ్చిన ఈ అతిథులు.. వరి కోతల తరువాత వ్యవసాయభూమిలో రాలిన ధాన్యం గింజలు, కలుపు మొక్కలు కీటకాలను ఆరగించి వచ్చే పంటకు చీడపీడల బెడద లేకుండా చేస్తున్నాయి. బాతుల రెట్ట సహజ ఎరువుగా పని చేయడంతో ఏడాదిలో రెండుసార్లు వలస వచ్చే బాతుల గుంపులను ఇక్కడి రైతులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది కూడా వచ్చిన సుమారు 15 కుటుంబాలు సాటాపూర్ ప్రాంతంలో రోడ్ల వెంబడి గుడారాలు వేసుకున్నారు. పొద్దంతా బాతుల గుంపులను వ్యవసాయభూముల్లో మేతకు వదులుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్