
మద్యం షాపులకు 34 దరఖాస్తులు
నిజామాబాద్‌అర్బన్ : మద్యం షాపులకు శ నివారం 34 దరఖాస్తులు స్వీకరించినట్లు జి ల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తె లిపారు. ఇప్పటి వరకు నిజామాబాద్ స్టేషన్ పరిధిలోని మొత్తం 36 వైన్ షాపులకు 53, బోధన్ స్టేషన్ పరిధిలోని 18 వైన్ షాపులకు 23, ఆర్మూర్ స్టేషన్ పరిధిలోని 25 వైన్ షా పులకు 36, భీమ్‌గల్ పరిధిలో 12 వైన్ షాపులకు 22, మోర్తాడ్ పరిధిలో 11 వైన్ షాపుల కు 15 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నా రు. జిల్లాలో మొత్తం 102వైన్‌షాపులకు 149 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
యథావిధిగా ప్రజావాణి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పదవులకు
దరఖాస్తులు షురూ
నిజామాబాద్ సిటీ : జిల్లా కాంగ్రెస్ పార్టీలో గడువు ముగిసిన పలు పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవితోపాటు నగర అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ కార్యాలయంలో శనివారం పలువురు ఆశావహులు తమ దరఖాస్తులను సమర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, గంగాశంకర్, కునిపురి రాజారెడ్డి, పోల వెంకటేశ్ దరఖాస్తు చేసుకున్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మహ్మద్ ఖైసర్, బొబ్బిలి రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకుడు గన్‌రాజ్, శరత్‌కుమార్ దరఖాస్తు అందజేశారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తుల స్వీకరణ
డిచ్‌పల్లి : ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శి క్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఎలక్ట్రీషియన్, ఫొటోగ్రఫీ, సీసీటీవీ కో ర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ నెల 13 నుంచి ఎలక్ట్రీషియన్(31 రో జులు), ఫొటోగ్రఫీ (30రోజులు), 15 నుంచి సీసీటీవీ(13రోజులు) కోర్సుల్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి, సదుపాయం, హాస్టల్ వసతి ఉంటుందని తెలిపారు. ఉమ్మ డి నిజామాబాద్ జిల్లాకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల వారు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జిరాక్స్, పదో తరగ తి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో వచ్చి రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. పూర్తి సమాచారం కోసం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ రోడ్డులో ఉన్న సంస్థ కా ర్యాలయంలో, 08461–295428 నంబర్‌లో సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.
చిరుత సంచారం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కంచుమల్, సీతాయిపల్లి రోడ్డుపై చిరుత సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. గత రెండు రోజులుగా రాత్రి వేళ కంచుమల్ నుంచి సీతాయిపల్లి వెళ్తున్న ప్రయాణికులకు రోడ్డుపై చిరుతపులి పరుగులు తీస్తూ కనిపించినట్లు పేర్కొన్నారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రాత్రి వేళ, మధ్యాహ్నం రోడ్డుపై ప్రయాణించాలంటే జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మద్యం షాపులకు 34 దరఖాస్తులు