
బీసీ కులగణన వివరాలు తెలపాలి
సుభాష్‌నగర్: రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేసిన వెనుకబడిన తరగతుల (బీసీ) కులగణన వివరాలను తెలియజేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆయన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తరపున పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. అలాగే బీసీ కులగణన నివేదిక వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వివరాలు ప్రజలకు తెలిస్తేనే రిజర్వేషన్ల ప్రక్రియ ఎంత పారదర్శకంగా, సమానత్వంతో అమలు చేయనున్నారో తెలుస్తోందన్నారు.
జిల్లావాసికి ఇన్నోవేషన్ అవార్డు
డొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్ జి ల్లా కేంద్రంలోని పద్మానగర్‌కు చెందిన డాక్టర్ సింగం సుస్మితకు బెస్ట్ ఇన్నోవే షన్ ఐడియేషన్ అవార్డు లభించింది. వ్యవసాయ కీటక శాస్త్రంలో ఆమె పీహెచ్‌డీ చేయగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఏరువాక ఫౌండేషన్ కిసాన్ మహోత్సవ్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు రావడంపై ఆమె తల్లిదండ్రులు పోశెట్టి, లావణ్య సంతోషం వ్యక్తం చేశారు.
ఖలీల్‌వాడి: జిల్లాలోని మద్యం షాపులకు ప్రభు త్వం టెండర్ నోటిఫికేషన్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. అయితే ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని సుభాష్‌నగర్‌లోగల ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్ర, శనివారం రెండు రోజులుగా మద్యం షాపులకు దరఖాస్తులు రాలేవు. రెండు రోజులుగా అల్పపీడనంతోపాటు బతుకమ్మ, దేవినవరాత్రులు ఉండటంతో వివిధ పనుల కారణంగా టెండర్లకు దరఖాస్తు చేయలేదని తెలుస్తోంది. సోమవారం నుంచి వైన్స్‌షాపులకు దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారుల ద్వారా తెలిసింది.

బీసీ కులగణన వివరాలు తెలపాలి