
మక్కలకు గడ్డు పరిస్థితి
మోర్తాడ్(బాల్కొండ): మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు వరుసగా కష్టాలు వెంటాడుతున్నా యి. నిన్న మొన్నటి వరకు మక్కలకు ధరలేక అన్నదాతలు ఆందోళన చెందగా.. ప్రస్తుతం నిరాటంకంగా కురుస్తున్న వర్షాలతో పంటకు మొలకలు వచ్చి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. వర్షాకాలం సీజన్‌లో మో ర్తాడ్, బాల్కొండ, కమ్మర్‌పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్ తదితర మండలాల్లో మొక్క జొన్న పంటను ఎక్కువగా సాగు చేశారు. కానీ పంట కోత దశకు చేరుకున్న నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వర్షాలతో పంట తడిసిపోగా, ఆరబెట్టినా వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటంతో తొందరగా మొలకలు వస్తున్నాయి. దీంతోపాటు మక్కల ధర క్వింటాలుకు రూ.2,400ల నుంచి రూ.1,900లకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన మక్కలను వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తడిసిన మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
● మొన్నటివరకు పంటకు
మద్ధతుధర కరువు
● ప్రస్తుతం వర్షాలతో
ఆరబెట్టిన మక్కలకు మొలకలు
● ఆందోళనలో అన్నదాతలు