
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
జక్రాన్‌పల్లి: మండలంలో పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డిచ్‌పల్లి సీఐ వినోద్ తెలిపారు. జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. జక్రాన్‌పల్లిలో ఎస్సై మాలిక్ రహమాన్ తన సిబ్బందితో బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో పాత నేరస్తుడు, మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన కోనేటి నరేష్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని పోలీసులు పట్టుకొని విచారించారు. రెండు నెలల క్రితం నల్లగుట్ట తండాలోని ఆలయంలో హుండీ చోరీ, ఈనెల 17న సికింద్రాపూర్‌లోని ఓ ఇంట్లో చోరీ చేసినట్లు అతడు అంగీకరించాడు. అతడి బ్యాగులో ఉన్న ఇనుప రాడ్‌ను, అతడి వద్ద నుంచి 9 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై మాలిక్ రహమాన్, ఏఎస్సై శంకర్, కానిస్టేబుళ్లు జీవన్, రాజేశ్వర్ ఉన్నారు.