
బతుకమ్మ పాట
శ్రీ గౌరీ పూజ ఉయ్యాలో
చేయబూనితిమి ఉయ్యాలో
కాపాడి మమ్మేలు ఉయ్యాలో
కై లాస వాసివి ఉయ్యాలో
కాపాడి మమ్మేలు ఉయ్యాలో
శంకరి పార్వతి ఉయ్యాలో
శంభుని రాణి ఉయ్యాలో
ధ్యానింతుమమ్మ ఉయ్యాలో
మమ్ములను కరుణించు ఉయ్యాలో
ఏటేటా పూజిస్తాం ఉయ్యాలో
మా ఊరు చల్లంగా చూడు ఉయ్యాలో
మనుసు పెట్టి ఉయ్యాలో
మనువంత నిన్ను చేసుకొని ఉయ్యాలో
నిండుగా మొక్కుతున్నాం ఉయ్యాలో
మమ్మేలు మా అమ్మ గౌరమ్మ ఉయ్యాలో
–ఉమారాణి వైద్య, అంగన్‌వాడీ టీచర్,
లింగాపూర్, కామారెడ్డి