
ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష
జక్రాన్‌పల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. జక్రాన్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీవో, ఎంపీవో, హౌసింగ్ ఏఈ, జీపీ కార్యద ర్శులతో బుధవారం కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష సమావే శం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో గ్రామంలో మంజూరైన ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇళ్లు ఏ దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాల లో వెనుకంజలో ఉన్న గ్రామ కార్యదర్శులపై కలెక్ట ర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్దేశిత లక్ష్యాల సాధ నకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. మంజూరైన లబ్ధిదారులు తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చే పట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ పక్కాగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. దసరా పండుగలోపు అన్ని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యే లా చొరవ చూపాలన్నారు. నిర్మాణ దశల మేరకు లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేస్తున్నామని గుర్తుచేశారు. అర్హులు నిర్మాణం చేపట్టేలా ఇందిర మ్మ కమిటీల సహకారం తీసుకోవాలన్నారు. కొందరు కార్యదర్శులు సాంకేతిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా రాష్ట్ర హౌసింగ్ ప్రధాన కార్యాలయ అఽ దికారులను ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యల ను పరిష్కరింపజేశారు. ఎంపీడీవో సతీశ్‌కుమార్, ఎంపీవో యూసుఫ్‌ఖాన్, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు