
తాళం వేసిన ఇంట్లో చోరీ
వర్ని: మండలంలోని మల్లారం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. గ్రామానికి చెందిన జంపాల అనిల్‌కుమార్, ఆయన భార్య పని నిమిత్తం బుధవారం ఉదయం వర్నికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 6 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి, రూ.49,500 నగదు అపహరించారు. బుధవారం సాయంత్రం అనిల్‌కుమార్ ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగిన విషయాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. అనిల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.