
ఈ గ్రామాల్లో దసరాకు జెండా ఎగురవేస్తారు
రామారెడ్డి: దసరా పండుగ అనగానే సెలవులకు స్వగ్రామాలకు వచ్చిన కుటుంబసభ్యులు, అతిథులతో గ్రామాలలో చుక్కా.. ముక్కతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, ఈ గ్రామాలలో మాత్రం జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకుంటున్నారు.
●రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని హనుమన్ మందిరం ఎదుట దసరా నాడు జెండాను ఎగరవేసి జాతీయగీతాన్ని ఆలపిస్తారు. ఇదే గ్రామంలోని ఇసన్నపల్లి కషీర్ దగ్గర మరో జెండాను ఎగరవేస్తారు.
●రెడ్డిపేట గ్రామంలోనూ భారీ కట్టెతో తయారు చేసిన జెండాను ఎగురవేసి జాతీయగీతాన్ని ఆలపిస్తారు.
●ఈ ఆచారం ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు.
●రెడ్డిపేట గ్రామంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ జెండాను కొన్నేళ్లపాటు ఎగురవేశారు.
●నక్సల్స్ ప్రభావిత గ్రామం కావడంతో జాతీయ జెండాకు బదులుగా తెల్లటి రంగు కలిగిన జెండాను ఎగురవేసినట్లుగా పూర్వీకులు చెప్తున్నారు.
●నిజాం పాలనలో ఉన్నప్పుడు వారు సూచించిన రంగు జెండానే ఎగురవేసేవారట.
●ప్రస్తుతం జిల్లాలోని పలు గ్రామాలలో దసరా రోజున సాయంత్రం జెండాను ఎగరవేస్తున్నారు. అనంతరం చావిడి వద్ద పూజలు చేసి జంబిని ఒకరికొకరు ఇచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెబుతుంటారు.
మీకు తెలుసా..

ఈ గ్రామాల్లో దసరాకు జెండా ఎగురవేస్తారు