
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
● బోధన్‌లో ఘటన..
బయటే వేచి ఉన్న సబ్ రిజిస్ట్రార్
● 36 నెలలుగా అద్దె చెల్లించని వైనం
● ఉన్నతాధికారుల జోక్యంతో
శాంతించిన యజమానులు
బోధన్‌టౌన్(బోధన్): భవనం అద్దె 36 నెలలుగా చె ల్లించకపోవడంతో యజమానులు గురువారం బో ధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయానికి తాళం వేయడంతో చేసేది లేక సబ్ రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బంది బయటే నిలబడ్డారు. రి జిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం అద్దె నెలకు రూ. 74 వేలు కాగా.. 36 నెలలకు సంబంధించి యజమానులకు రూ.26,64,000 చెల్లించా ల్సి ఉంది. అద్దె చెల్లించాలని యజమానులు పలుమార్లు అడిగినా స్పందించకపోవడంతో గురువా రం కార్యాలయానికి తాళం వేశారు. యజమానులు ఈ నెల 8వ తేదీన సబ్ రిజిస్ట్రార్‌కు నోటీసు సైతం అందించారు. ఈ ఘటనపై సబ్ రిజిస్ట్రార్ సాయిబాబాను వివరణ కోరగా.. అద్దె చెల్లించాల్సిన విష యం వాస్తవమేనని, ఉన్నతాధికారులకు వివరించామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు భవన యజమానులతో మాట్లాడి అద్దె బకాయి చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు తాళం తీశారు. దీంతో యథావిధిగా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ కొనసాగింది.