
గొడవపడ్డ నలుగురికి రూ.20 వేల జరిమానా
ఎల్లారెడ్డి: ఇంటి విషయంలో గొడవపడిన నలుగురికి రూ.20 వేల జరిమానా విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ తీర్పు ఇచ్చినట్లు పోలీసులు గురువారం తెలిపారు. 2019లో నీల సిద్దిరాములు అనే వ్యక్తితో ఇంటి విషయంలో దండు నర్సింలు, దండు శివరాములు, దండు అంజయ్య, దండు గణేశ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనపై నీల సిద్దిరాములు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై మోహన్ కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్టు కానిస్టేబుల్ వినోద్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి సాక్షులను సమయానికి హాజరుపర్చారు. సాక్ష్యాలు, వాదనలు విన్న అనంతరం, న్యాయమూర్తి నిందితులు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో నిందితులు జరిమానా మొత్తాన్ని చెల్లించారు.
బోధన్: ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్సీ ఫారం వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రోడ్‌లో గురువారం గ్యాస్ సిలిండర్ లోడ్‌తో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీసీ బస్సును ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.