
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
వర్ని: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ప్రతి వి ద్యార్థి నిర్దేశించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మోస్రా మండలంలోని చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఏకాగ్రతతో ముందుకు సాగి తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని సూ చించారు. అంకిత భావం, పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించుకోవచ్చున ని దిశానిర్దేశం చేశారు. చదువులో ఎలా రాణించాలి, పరీక్షల్లో ఎలా విజయం సాధించాలి, లక్ష్యానికి అనుకూలంగా సిలబస్‌ను ఏవిధంగా సకాలంలో పూర్తి చేయాలి, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఏం చేయాలన్న దానిపై విద్యార్థులకు సలహాలు సూచనలు అందజేశారు. అంతకుముందు పాఠశాల, అంగన్‌వాడీల్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. మెనూ తప్పకుండా పాటించాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. ప్రైమరీ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవోను ఆదేశించారు.