
అనుకూల సమయాల్లో పంటలు విక్రయించుకోవాలి
● ఐసీఎం హైదరాబాద్ ఉపసంచాలకుడు డా.ఎస్ శ్యాంకుమార్
నిజామాబాద్ రూరల్: రైతులు పండించిన పంటలను గోదాముల్లో భద్రపరచి, అనుకూల సమయంలో మార్కెట్‌లో విక్రయించడం ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చునని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ (ఐసీఎం) హైదరాబాద్ ఉప సంచాలకుడు డా.ఎస్ శ్యాంకుమార్ పేర్కొన్నా రు. మాధవనగర్‌లో గురువారం గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో రైతులు, వ్యాపారులు, మిల్లర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీఎం మాట్లాడుతూ వేర్‌హౌస్ రసీదుల ఆధారంగా రైతులు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపారు. అనంతరం రైతులను నిజామాబాద్ ఏఎంసీ, శ్రద్ధానంద్‌గంజ్‌కు తీసుకెళ్లి గోదాం సదుపాయాలు, నిల్వ విధానాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎన్ శ్రీనివాసరావు, సహాయక రిజిస్ట్రార్ సరస్వతి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పీఏసీఎస్ మాధవనగర్ అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పోతరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.