
తాళం వేసిన ఇంట్లో పట్టపగలే చోరీ
బోధన్: ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో బుధవారం పట్టపగలే తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన ప్రకారం.. కుర్నాపల్లి గ్రామానికి చెందిన తులసిగారి నరేందర్ తన సతీమణితో కలిసి అత్తగారి గ్రామం మెంట్రాజ్‌పల్లికి వెళ్లారు. సాయంత్రం తన బంధువు ఫోన్ చేసి ఇంటి తాళం పగుల గొట్టబడి ఉందని తెలపడంతో వెంటనే స్వగ్రామానికి వచ్చారు. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.15 వేలు నగదు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై రమ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమ తెలిపారు.