
కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలి
ఖలీల్‌వాడి: పోక్సో, గ్రేవ్ కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని క మాండ్ కంట్రోల్ హాల్‌లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో పూర్తి పారదర్శకంగా విచారణ చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, ప్ర జలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేయాలని సూచించారు. గ్రామ పో లీస్ అధికారులు ప్రతి రోజు గ్రామాన్ని సందర్శించి, ప్రజలతో మమేకమవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
బ్లాక్ స్పాట్లను గుర్తించాలి
ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ ఉండే లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించాలని తెలిపారు. నేషనల్ హైవే, స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. దొంగతనాలు జరగకుండా పాతనేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, క్రయవిక్రయాలు, జూదం, రేషన్ బియ్యం అక్రమరవాణా లాంటి వా టిపై ఉక్కుపాదం మోపాలన్నారు. తరచూ ఇలాంటి నేరా లకు పాల్పడేవారిపై పీడీ యాక్టు కోసం పంపాలని ఆదేశాలు జారీచేశారు. సమీక్షలో డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు రాజావెంకట్ రెడ్డి, జె. వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం ఉన్నారు.
సిబ్బందికి ప్రశంసాపత్రాలు
వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ పండుగలను శాంతియుతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి సీపీ సాయిచైతన్య అభినందనలు తెలిపా రు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన పలు వురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. వచ్చే దేవీ నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగలను ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు
కృషి చేయాలి
నెలవారీ సమీక్షా సమావేశంలో
సీపీ సాయిచైతన్య

కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలి