క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Sep 19 2025 2:46 AM | Updated on Sep 19 2025 2:46 AM

క్రైం

క్రైం కార్నర్‌

కళ్యాణిలో మద్యానికి బానిసై యువకుడు.. కల్కి చెరువులో మహిళ మృతదేహం

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య

ఖలీల్‌వాడి: అతిగా మద్యం సేవించొద్దని భార్య మందలించినందుకు మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధి లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్సపల్లిలోని భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన ఎనుగందులు మహేశ్‌(33) నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో లేబర్‌గా పనిచేసేవాడు. కొంతకాలం నుంచి మహేశ్‌ మద్యానికి బానిస కావడంతో భార్య తాగు డు మానుకోవాలని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన మహేశ్‌ బుధవారం అర్ధరాత్రి నిజామాబాద్‌–జానకంపేట్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు రాకను గమనించి అడ్డుగా వెళ్లడంతో రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఎల్లారెడ్డి: మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన బండారి సాయిలు (42) మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పా ల్పడినట్లు ఎల్లారెడ్డి ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి గురువారం తెలిపారు. మద్యానికి బానిసైన సాయిలు కుటుంబంలో బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సాయిలు గురువారం వేకువజామున బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

కాకతీయ కాలువలో పడి యువకుడు..

బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్‌కు చెందిన షేక్‌ అస్గర్‌(42) ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి బుధవారం మృతి చెందాడు. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌ అస్గర్‌ బుధవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కాకతీయ కాలువలో దిగాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు కాలువలో గాలింపుచర్యల చేపట్టగా గల్లంతైన చోటే మృతదేహాం లభ్యమైంది. కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

బాన్సువాడ : పట్టణంలోని కల్కి చెరువులో గుర్తుతెలియని మహిళ (45– 50) మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకి తీశారు. మెరూన్‌ కలర్‌ చీర, ఆకుపచ్చని జాకెట్‌ ధరించి ఉందని, గుర్తు పట్టనంతగా మృతదేహం ఉబ్బిందని సీఐ అశోక్‌ తెలిపారు. వివరాలకు 8712686167ను సంప్రదించాలని సూచించారు.

క్రైం కార్నర్‌1
1/3

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌2
2/3

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌3
3/3

క్రైం కార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement