
ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్‌గా సత్యనారాయణరెడ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి మావురపు సత్యనారాయణ రెడ్డి ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్‌గా నియామకమయ్యారు. తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆదేశా ల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి గురువారం సత్యనారాయణరెడ్డికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో డైరెక్టర్‌గా నియమించిన వీసీ, రిజిస్ట్రార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా జ్యోత్స్న
తెయూ ఇంగ్లిష్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎల్.జ్యోత్స్న గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా నియామకమయ్యారు. వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి గురువారం ఆమెకు నియాకమ ఉత్తర్వులు అందజేశారు.
సుభాష్‌నగర్: జిల్లా పంచాయతీ కార్యాలయ పరిపాలనా అధికారి(ఏవో)గా రాజాబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజాబాబు పదోన్నతి పొందారు. డీపీవో కార్యాలయ ఏవో పోస్టు ఖాళీగా ఉండటంతో ఆయనకు జిల్లాలోనే కేటాయించారు. రాజాబాబును డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్‌పీవోలు శ్రీనివా స్, నాగరాజు, శివకృష్ణ, ఉద్యోగులు కృష్ణ, ఆ దిత్య, నరహరి తదితరులు అభినందించారు.
బాన్సువాడ: బోర్లం క్యాంపులో నిర్వహించే జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం డీఎస్పీ విఠల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వాలీబాల్ టోర్నీ కొనసాగుతుందని, జిల్లాలోని వివిధ మండలాల క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు ధరావత్ రవి తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేల నగదుతో పాటు మెమోంటోలు అందజేస్తామని వారు తెలిపారు.

ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్‌గా సత్యనారాయణరెడ

ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్‌గా సత్యనారాయణరెడ

ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్‌గా సత్యనారాయణరెడ