
చిన్నారులకు సరైన పోషణ అందించాలి
● డీడబ్ల్యూవో రసూల్ బీ
● అంగన్‌వాడీ టీచర్లకు ముగిసిన శిక్షణ
డిచ్‌పల్లి: చిన్నారులకు సరైన పోషకాహారాన్ని అందించాలని, 0–5 సంవత్సరాల లోపు పిల్లల్లో ముందుగానే లోపాలను గుర్తించి తల్లిదండ్రులకు తగిన సలహాలు ఇచ్చి డాక్టర్‌కు రిఫర్ చేయాలని జిల్లా సంక్షేమాధికారిణి (డీడబ్ల్యూవో) రసూల్ బీ సూచించా రు. డిచ్‌పల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్ల కు ‘పోషణ్ బీ–పడాయి బీ’ అనే అంశంపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరైన డీడబ్ల్యూవో మాట్లాడుతూ 0–3 సంవత్సరాల లోపు పిల్లలకు నవచేతన ద్వారా ప్రేరణ కలిగించాలన్నారు. 3–6 సంవత్సరాల పిల్లలకు ఆథశిల ద్వారా ప్రీస్కూల్ విద్యను నేర్పించాలన్నారు. ఎత్తుకు తగ్గ బరువులో సాధారణ బరువు వచ్చే వరకు పోషకాహారం కొనసాగించాలన్నారు. దివ్యాంగ పిల్లలకు యూడీఏడీ కార్డులు ఇప్పించాలన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని మానవతసదన్‌లో 92, నడిపల్లి రైతువేదిక లో 94, ధర్మారం(బి) రైతువేదికలో 97 మందికి శిక్షణ నిచ్చినట్లు సీడీపీవో జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు మమత, బుజ్జి, శోభ, వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, రాధలక్ష్మి, సునీత, సరిత సిబ్బంది పాల్గొన్నారు.