
వరద కాలువలో వృద్ధురాలి మృతదేహం
● మోర్తాడ్ మండల
నివాసిగా గుర్తింపు
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి శివారు వరద కాలువలో ఓ వృద్ధురాలి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహం మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ప్రభావతిగా మల్యాల పోలీసులు గుర్తించారు. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. కామణి ప్రభావతి (66) కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంధువులు మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుమారుడు శ్రీనివాస్ వెతుకుతున్నాడు. వరద కాలువలో శవం కొట్టుకురావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. శ్రీనివాస్‌ను పిలిపించగా తన తల్లిగా గుర్తించాడు. కేసు నమోదు చేసినట్లు మల్యాల పోలీసులు తెలిపారు.
మిలిటరీ మద్యం
అమ్మొద్దు.. కొనొద్దు
మాచారెడ్డి: మిలిటరీ మద్యాన్ని అమ్మినా, కొనుగోలు చేసినా నేరమేనని కామారెడ్డి ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ అన్నారు. గురువారం పాల్వంచ మండలం ఆరేపల్లిలో ఒకరి ఇంట్లో నిల్వ చేసిన మిలిటరీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వ చేసిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. ఈ దాడిలో ఎస్సైలు విక్రమ్, శ్రీనివాసరావు, సిబ్బంది పాషా, మైస రాజు, దేవాకుమార్ పాల్గొన్నారు.

వరద కాలువలో వృద్ధురాలి మృతదేహం