తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. వర్సి టీ కళాశాలలో జరిగిన ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం నాలుగో సెమిస్టర్ పరీక్షలలో మొత్తం 28 మంది విద్యార్థులకు 28 హాజరైనట్లు పేర్కొన్నారు.
గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో తరలించిన సీపీ
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధి నడిపల్లి శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం ద్విచక్రవాహనంపై వెళుతున్న అశో క్ గాబ్రీ అదుపుతప్పి కిందపడగా తలకు బలమైన గాయాలయ్యాయి. అదే సమయంలో డిచ్‌పల్లి ఖిల్లా గ్రామానికి వెళ్తున్న సీపీ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. 108 అంబులెన్స్‌ను పిలిపించి తీవ్రంగా గాయపడిన అశోక్‌ను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీపీ వెంట డిచ్‌పల్లి ఎస్సై ఎండీ షరీఫ్, సిబ్బంది ఉన్నారు.
జెండా ఎగురవేసిన సీపీ
ఖలీల్‌వాడి: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య బుధవారం జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీపీలు బస్వారెడ్డి, రాంచందర్ రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వై వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, సీఐలు, ఆర్‌ఎస్సై, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
విశ్వేశ్వర శర్మకు డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పరిశోధక విద్యార్థి ఏ.విశ్వేశ్వర శర్మ పీహెచ్‌డీ డాక్టరేట్ సాధించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ జి.మనోజ పర్యవేక్షణలో ‘అప్లికేషన్స్ అండ్ రేసియల్ ఆఫ్ నాదిన్ గార్డెమర్’ అనే అంశంపై విశ్వేశ్వర శర్మ పరిశోధన పూర్తి చే సి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. బుధవా రం తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్‌లో నిర్వహించిన ఓపెన్ వైవాకు ఓయూ ప్రొఫెసర్ సవిన్ ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ లావ ణ్య, హెచ్‌వోడీ రమణాచారి, బీవోఎస్ చైర్మన్ సమత, అధ్యాపకులు పాల్గొన్నారు.