
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
● ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హాజరై జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్దార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలు, బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాల, డిచ్‌పల్లి మానవతా సదన్ చిన్నారులు చూడచక్కని నృత్యాలు ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఆర్.భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు