ఎన్‌డీసీసీబీ వైస్ చైర్మన్‌కు ఎమ్మెల్యే పరామర్శ
నిజామాబాద్‌నాగారం: దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానని విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి అన్నారు. బుధవారం నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌స్ట్రక్షన్‌లో నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాల ను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి సందర్శించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో 33 ఏళ్ల క్రితం కలెక్టర్‌గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం టీఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు, సైనికుడిని సన్మానించా రు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సి ద్ధయ్య, ప్రిన్సిపాల్‌జ్యోతి, మానసిక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, రమణస్వామి, టీఎన్‌ఆర్ ఫౌండేషన్ అశోక్ కుమార్, జిల్లా సైనిక వెల్ఫేర్ అధ్యక్షుడు హరప్రసాద్ పాల్గొన్నారు.
ప్రోత్సాహకాలు అందజేత
మోపాల్: నగరశివారులోని బోర్గాం(పి)లో ఎన్‌డీసీసీబీ వైస్ చైర్మన్, సొసైటీ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి తల్లి నల్ల మంగమ్మ మృతిచెందడంతో వారి కుటుంబాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, అశోక్ తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు జామెట్రీ బాక్సులు అందజేత
నిజామాబాద్ రూరల్: శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జెడ్పీహెచ్‌ఎస్ కాలూర్ పాఠశాల విద్యార్థులకు 80 జామెట్రీ బాక్సులు, 150 పెన్నులను అందజేశారు. వి ద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తెలిపారు. సంస్థ ప్రతినిధులు రామ్ మోహన్, శ్రీనివాస్, రాజశేఖర్, బాలశేఖర్, ఇన్‌చార్జి హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ధర్పల్లి: మండలంలోని దుబ్బాక ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న 60 మంది విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం రూ. వెయ్యి చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు. ఎంఈవో రమేశ్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాజారెడ్డి సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందిస్తున్న ఉల్లాస్ ట్రస్ట్ ప్రతినిధులు అశ్విన్ స్వప్న దంపతులు తెలిపారు.
అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైనట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రశేఖర్ కాలనీకి చెందిన సుమయ్య బేగమ్ తన ఎనిమిదేళ్ల కొడుకు మహమ్మద్ హుస్సేన్‌ను భారతీరాణి కాలనీలో ఉన్న తన అమ్మ సమీనా బేగం ఇంటి వద్ద మంగళవారం వదిలి వెళ్లింది. బాలుడు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో బయట ఆడుకోడానికి వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో సమీనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాలుడు ఆడుకుంటూ సమీపంలో ఉన్న బాబన్ సాహబ్ పహడ్ దర్గా వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని అతని తల్లి దండ్రులకు అప్పగించినట్లు ఎస్సై గంగాధర్ పేర్కొన్నారు.
డ్రంకన్ డ్రైవ్‌లో ఒకరికి రెండు రోజుల జైలు
ఖలీల్‌వాడి: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఒకరికి మెజిస్ట్రేట్ నూర్జహాన్ రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టబడ్డు 13 మందిని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో 12 మందికి రూ. 15 వేల జరిమానా విధించగా ఆర్మూర్‌కు చెందిన సయ్యద్ అజ్జుకు రెండు రోజుల జైలు శిక్షను మెజిస్ట్రేట్ విధించినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.
జీపీకి ఫ్రీజర్ అందజేత
డిచ్‌పల్లి: మండలంలోని ఘన్‌పూర్‌కు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు బుధవారం మృతదేహాన్ని పరిచే ఫ్రీజర్‌ను జీపీకి అందించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, జీపీ కార్యదర్శి, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా