
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
డిచ్‌పల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాపోటీల్లో రాణించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. బుధవారం మండలంలోని డిచ్‌పల్లి ఖిల్లా జెడ్పీ పాఠశాలను సీపీ సందర్శించారు. పాఠశాలకు రూ.60వేలు విలువ గల క్రీడాపరికరాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్‌రెడ్డి వితరణ చేశారు. ఈ క్రీడాపరికరాలను సీపీ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. సీపీ మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ పీడీగా అవార్డు తీసుకున్న పీడీ స్వప్నను సీపీ సన్మానించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ షరీఫ్, పాఠశాల హెచ్‌ఎం బి.సీతయ్య, ఖిల్లా రామాలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సావిత్రి, గ్రామపెద్దలు బూస సుదర్శన్, నర్సారెడ్డి, యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.