
రైతులను ఆదుకోండి
నిజామాబాద్ రూరల్: ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జిల్లాకు వచ్చిన సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి కంఠేశ్వర్‌లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగెట్ శేఖర్‌గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మునిపల్లి సాయారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.