
ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
సుభాష్‌నగర్/ ధర్పల్లి/ సిరికొండ/ మోపాల్/ నిజామాబాద్ రూరల్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ యుగపురుషుడని అన్నారు. జీజీహెచ్‌లో పార్టీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆలయంలో పూజలు నిర్వహించారు. సపాయి కార్మికులకు చేతు గ్లౌజులు, డెటాల్ సబ్బులను అందజేశారు. సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి హాజరయ్యారు. శుభోదయం పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. మోపాల్ మండల కేంద్రంలోని కేజీబీవీలో పదోతరగతి విద్యార్థినులకు బీజేపీ నాయకులు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. నగరంలోని గాజుల్‌పేటలో ఉన్న గురుద్వారాలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు