
ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
● జాతీయ జెండాలను ఆవిష్కరించిన నేతలు, అధికారులు
నిజామాబాద్ సిటీ/ సిరికొండ/ ధర్పల్లి/ డిచ్‌పల్లి/ మోపాల్/ సుభాష్‌నగర్/ నిజామాబాద్ రూరల్/ నిజామాబాద్‌నాగారం/ నిజామాబాద్ లీగల్/ జక్రాన్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పా లన వివరిస్తూ ప్రజాపాలన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, నుడా కార్యాలయంలో చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ భవన్‌లో జిల్లా గ్రంథాలయ చైరమ్న్ అంతిరెడ్డి రాజారెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించా రు. సిరికొండ, ధర్పల్లి, డిచ్‌పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ప్రజాపాలన వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో స్ జిల్లా కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రి న్సిపాల్ ఎన్ కృష్ణమోహన్, జిల్లా కోర్టు ప్రాంగ ణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జక్రాన్‌పల్లిలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.