
యూరియా కోసం బారులు తీరిన రైతులు
సిరికొండ: మండలంలోని తూంపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బుధవారం బారులు తీరారు. సొసైటీకి మంగళవారం 225 సంచుల యూరియా వచ్చింది. బుధవారం పంపిణీ చేస్తారని ఉదయం ఆరు గంటల నుంచే రైతులు సొసైటీ వద్దకు తరలివచ్చారు. అధికారులు వచ్చేంత వరకు వరుసలో నిలబడలేక చెప్పులను వరుసలో ఉంచారు. పోలీసుల సహకారంతో ఏవో నర్సయ్య, సొసైటీ సీఈవో దేవిలాల్, సిబ్బంది ఒక్కో రైతుకు రెండు సంచుల చొప్పున యూరియాను పంపిణీ చేశారు.
నిజామాబాద్ లీగల్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. ఉదయభాస్కర్ రావు అన్నారు. నగరంలోని అంబేడ్కర్ కాలనీలో బుధవారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏడాదికి రూ. మూడు లక్షలకన్నా ఆధాయం తక్కువ ఉన్న వారికి ఉచిత న్యా య సహాయం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు,కాలనీవాసులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఉన్న అభయాంజనేయ ఆలయం వద్ద యువ నేత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

యూరియా కోసం బారులు తీరిన రైతులు