
ఘనంగా విశ్వకర్మ జయంతి
నిజామాబాద్ రూరల్/ సిరికొండ/ ధర్పల్లి: ఆర్యనగర్‌లోని హనుమాన్ మందిర కమిటీ హాల్‌లో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్‌కు పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వెంకటేశం, రమేశ్, అంజయ్య, గంగేశ్వర్, లక్ష్మీనారాయణ, రామస్వామి, విశ్వనాథ్, సంఘ సభ్యులు వెంకట చారి, గంగాధర్, పురుషోత్తం, దేవ శర్మ, అశోక్, రాంబాబు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని న్యావనందిలో విశ్వకర్మ చిత్ర పటానికి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పూజలు చేశారు. ధర్పల్లిలో మండలంలో మైలారంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శోభాయాత్ర నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు.

ఘనంగా విశ్వకర్మ జయంతి