
పంటలను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలి
● జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు
మోపాల్: రైతులు పండించిన పంటలను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని, గిట్టుబాటు ధర వచ్చిన సమయంలో విక్రయించుకోవాలని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు సూచించారు. బుధవారం నగర శివారులోని బోర్గాం(పి) సొసైటీలో గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గిడ్డంగుల్లో పంటలను భద్రపర్చుకున్న సమయంలో పొందిన రసీదుల ఆధారంగా రైతులు బ్యాంకుల ద్వారా రు ణాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఐసీఎం డాక్టర్ శ్యాంకుమార్ మాట్లాడుతూ.. రైతులు గోదాములను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సహకార శాఖ అధికారి సరస్వతి, సొసైటీ వైస్ చైర్మన్ జయకృష్ణారెడ్డి, డైరెక్టర్లు గంగదాస్, సాయిరెడ్డి, మోహన్, నారాయణ, రైతులు సూర్యారెడ్డి, చిట్టి సాయిరెడ్డి, సుభాష్, రాజారెడ్డి, హన్మాండ్లు, పండరి, వ్యాపారులు, సొసైటీ సిబ్బంది నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.