
సీఎం సలహాదారుకు వినతులు
నిజామాబాద్‌నాగారం: ఉద్యోగుల సమస్యలపై జిల్లాకు వచ్చిన సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి టీఎన్జీవోస్, రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో విన్నవించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, రెవె న్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, శశికాంత్ రెడ్డి, విశాల్, మారుతి, సునీల్ పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణతో రోస్టర్ పాయింట్‌ల విధానంలో మాలలకు అన్యాయం జరుగుతుందని వెంటనే తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఆధ్వర్యంలో జిల్లా మాల మహానాడు కార్యవర్గ సభ్యులు సీఎం సలహాదారుడికి వినతిపత్రం అందజేశారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చొక్కం దేవీదాస్, నాంది వినయ్ కుమార్, ఆసది గంగాధర్, పి.చంద్ర కాంత్, బీస భూమయ్య, శంకరయ్య, బాలస్వామి, దొడ్డి మోహన్, భూషణ్, గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.