
‘బోను ఏర్పాటు చేస్తాం’
మద్నూర్: చిరుత పులి జాడ కోసం గాలిస్తున్నామని, దానిని పట్టుకునేందుకు బోన్‌లు ఏర్పాటు చేస్తా మని అటవీశాఖ రేంజ్ అధికారి సంతోష తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యలయానికి సో మవారం మద్నూర్ గ్రామస్తులు, రైతులు తరలి వచ్చి చిరుత పులిని పట్టుకోవాలని తహసీల్దార్ ము జీబ్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తహసీల్ కార్యలయానికి వచ్చిన అటవీశాఖ అధికారులు రై తులతో సమావేశమయ్యారు. పులిని పట్టుకోవడాని కి డ్రోన్ కెమెరాలను, బోన్‌లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అ టవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సుజాత, బీట్ అధికారి రాంచందర్, రైతులు బాల్‌కిషన్, రాములు, హన్మండ్లు, పరశురాం, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ఈనెల 19న మధ్యాహ్నం పంట ఉత్పత్తులను వేలం వేయనున్నట్లు క్షేత్రం ఏడీఏ ఇంద్రసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన క్షేత్రంలో విత్తనం కోసం ఉపయోగపడని కేఎన్‌ఎం–1638 సన్నరకానికి చెందిన 492 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విత్తన క్షేత్ర కార్యాలయంలో వీటిని వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. వేలం తర్వాత నిర్ధారించిన సొమ్ములో సగం డబ్బులను రెండురోజులో చెల్లించాలని, మిగతా మొత్తాన్ని వారంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.