
విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
● సీపీ సాయి చైతన్య
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం ఇంజినీర్స్ డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ సాయిచైతన్య హాజరై మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విభాగంలో ఉమ్మడి ఏపీతోపాటు దేశానికి విశ్వేశ్వరయ్య చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని గుర్తు చేశారు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం కళాశాల టాపర్లకు గోల్డ్‌మెడల్, బిగాల కృష్ణమూర్తి ట్రస్ట్ నుంచి రూ.10వేల చెక్కు, సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భారతి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, సహా అధ్యక్షుడు కేఎల్వీ రమణ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, వినోద్, మోహన్ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేశ్, కళాశాల అధ్యాపకులు నాగరాజ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.