
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఇందల్వాయి/ఖలీల్‌వాడి: ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే లైనును ఓ వ్యక్తి దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం గన్నా రం గ్రామానికి చెందిన బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం తన పొలం వద్దకు బయలుదేరాడు. ఈక్రమంలో ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలను అతడు దాటుతుండ గా గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాడు. స మాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోచారం ప్రాజెక్టు నీటిలో పడి యువకుడు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటిలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. మెదక్ పట్టణానికి చెందిన షేక్ మహబూబ్(20)అనే యువకుడు ఆదివారం తన స్నేహితుల తో కలిసి మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వ చ్చాడు. ప్రాజెక్టు అలుగు పైనుంచి వెళ్తుండగా, కా లు జారి నీటి ప్రవాహంలో పడిపోయాడు. నీటము నిగి ఊపిరాడక మృతిచెందినట్లు తెలిసింది. మృతుడి అన్న షేక్ వాజీద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి