
పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా యాదగిరి
నిజామాబాద్ నాగారం: నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి గెలుపొందారు. ఆయన ప్యానెల్‌లోని 11 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఓటర్లు పాల్గొన్నారు. నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 85 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 894 ఓట్లకు 757 ఓట్లు పోలయ్యాయి. 11 పదవులకు 34 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. దీకొండ యాదగిరి, ఎస్‌ఆర్ సత్యపాల్, కొండి రమేశ్ ప్యానెళ్లు బరిలో నిలిచాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. యాదగిరికి 441 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి సత్యపాల్‌కు 236 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారిగా న్యాయవాది రేగొండ గంగాప్రసాద్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా పగిడిమారి యాదగిరి, కర్లం రాములు వ్యవహరించారు. ఎన్నికలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నూతన కార్యవర్గం ఇదే..
అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గంట్యాల వెంకటనర్సయ్య, కోశాధికారిగా కన్న రాజు, ఉపాధ్యక్షులుగా గుజ్జేటి వెంకటనర్సయ్య, ఎనగందుల మురళి, నూకల విజయసారథి, సహాయ కార్యదర్శి బొమ్మెర తులసీప్రసాద్, లక్కపత్రి దేవిదాస్, గాలిపల్లి వెంకటేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కై రంకొండ మురళి, కల్చరల్ సెక్రెటరీగా తన్నీరు శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా యాదగిరి

పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా యాదగిరి