
కరెంట్‌షాక్‌తో నెమలి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కృష్ణాజివాడి గ్రామ శివారు లో కరంట్ వైర్లకు నెమలి తగిలి షాక్‌తో మృతిచెందినట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా కరంటు సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది వచ్చి స్తంభాలను, వైర్లను పరిశీలించారు. సమస్యను గుర్తించకపోవడంతో వేరే లైన్‌కు కనెక్షన్ ఇచ్చారు. తిరిగి ఆదివారం అధికారులు గ్రామశివారులో గల విద్యుత్ స్తంభాలు, వైర్లను పరిశీలించారు. శివారులోని వైర్లపై నెమలి పడి చనిపోయినట్లు కనిపించిందన్నారు. దీంతో వైర్లపై మృతి చెంది ఉన్న నెమిలిని కిందికి తీసి యథావిధిగా కరంటు కనెక్షన్ ఇచ్చారు.