
హిందువులను స్వయంసేవకులుగా చేయడమే లక్ష్యం
సుభాష్‌నగర్: ప్రతీ హిందువును స్వయంసేవక్‌గా తయారు చేయడమే శతాబ్ది ఉత్సవాల లక్ష్యమని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘ్ చాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం అన్నారు. ఇందుకోసం రానున్న విజయదశమి నుంచి ఏడాది పాటు వివిధ కార్యక్రమాలను రూ పొందించినట్లు తెలిపారు. నగరంలోని న్యూ హౌసింగ్‌బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ కంఠేశ్వర్, నాందేవ్‌వాడ ఉప నగరాల ఆధ్వర్యంలో గణవేశ్‌ధారి స్వయంసేవకుల సంఘీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుచరణం ముఖ్య వక్త గా విచ్చేసి, మాట్లాడారు. సామాజిక సమరసత, ప్రకృతి పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ సంరక్షణ ఆధారంగా బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించడం కోసమే సంఘం పని చేస్తుందన్నారు. అంతకు ముందు హౌసింగ్ బోర్డ్ కాలనీలో పథ సంచలన్ నిర్వహించారు. నగర కార్యవాహ అర్గుల సత్యం, ఉపనగర కార్యవాహలు మధుకర్, ప్రవీణ్ తదితరులు పా ల్గొన్నారు.

హిందువులను స్వయంసేవకులుగా చేయడమే లక్ష్యం